Nara Lokesh : 2029 లోపల 5 లక్షల ఐటి ఉద్యోగాలు

  • సూమారు 65 వేలు ఐటి రంగంలోనే ఉద్యోగాలు కల్పించబోతున్నాం
  • ఐటి రంగంలో 2029 లోపల 5 లక్షల ఉద్యోగాలు విశాఖపట్నంలో కల్పించాలని
  • 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి
  • 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం

2029 లోపల 5 లక్షల ఐటి ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనమండలి సమావేశాల్లో కూటమి మరియు వైసిపి ఎమ్మెల్సీ లతో పాటు కొందరు కూటమి మంత్రులు కూడా హాజరయ్యారు. ఐటి రంగం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్. 2029 నాటికి ఐటి రంగంలో 5 లక్షల ఐటి ఉద్యోగాలు కల్పిస్తాం అని నారా లోకేశ్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

2029 లోపల 5 లక్షల ఐటి ఉద్యోగాలు

సూమారు 65 వేలు ఐటి రంగంలోనే ఉద్యోగాలు కల్పించబోతున్నాం. కేవలం 5 కంపెనీ లకే 65 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మా లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఐటి రంగంలో 5 లక్షల ఉద్యోగాలు విశాఖపట్నంలో కల్పించాలని, అది కూడా 2029 లోపల కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది వైసిపి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అనేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment