2028 కి 50 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు తన రాజకీయ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఆయన రాజకీయ ప్రస్థానం 2028 నాటికి 50 సంవత్సరాలు పూర్తి కానున్నాయని చంద్రబాబు గారు వెల్లడించారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
- 2028 నాటికి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం
- 30 సంవత్సరాల నుంచి ఎవరు పోల దావోస్ కి నేను వెళ్ళాను
- హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ వన్ సిటీగా తయారయింది
- ఒకప్పుడు టెక్నాలజీ నన్ను ఎగతాళి చేశారు
- ఫోన్ కూడు పెడుతుందా అని నన్ను ఎగతాళి చేశారు
- భవిష్యత్తులో AI డాక్టర్ వస్తాడు
2028 కి 50 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం..!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నగరిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. చంద్రబాబు గారి మాటల్లోనే తెలుసుకుందాం.
నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… 2028 నాటికి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం అంటే 1978 లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ లో చదువుకుంటూ అక్కడే పోటీ చేశా అక్కడి నుంచి అంచెలు అంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయాను. 30 సంవత్సరాల నుంచి ఎవరు పోల దావోస్ కి నేను వెళ్ళాను. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను నేను అనునిత్యం విద్యార్థినిమీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను.
ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పని చేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆరోజు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్
ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ వన్ సిటీగా తయారయింది.

ఫోన్ కూడు పెడుతుందా అని నన్ను ఎగతాళి చేశారు
నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఒకప్పుడు టెక్నాలజీ నన్ను ఎగతాళి చేశారు. ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది.
భవిష్యత్తులో AI డాక్టర్ వస్తాడు
నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏఐ డాక్టర్ వస్తాడు. నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లా ఉంది. ఇంకొక ఇదే మారిగా నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది తొందరలోనే సంజీవని ప్రాజెక్ట్ వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్న ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు. మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు తర్వాత గ్రాడ్యువల్ గా కరెంట్ పట్టణాలకు వచ్చింది. పల్లెలకు వచ్చింది. ముందు ఇండ్లకు వచ్చింది. తర్వాత వ్యవసాయానికి వచ్చింది ఇప్పుడు మన ఇంటి పైనే మనం కరెంట్ తయారు చేసుకుంటున్నాం అని చంద్రబాబు గారు తెలిపారు.
