2014 మొదటి దెబ్బ ఐతే 2019-24 పెద్ద షాక్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడవరోజు ప్రారంభమయ్యాయి. మూడవరోజు అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్. 2014 లో విభజన మొదటి దెబ్బ అయితే 2019-2024 మధ్య దుష్పరిపాలన మరో పెద్ద షాక్ అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
2014 మొదటి దెబ్బ ఐతే 2019-24 పెద్ద షాక్
గత ప్రభుత్వ విద్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విద్వంసాన్ని గమనంలో ఉంచుకొని 2024 బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ మిగిల్చిన గాయాల్ని మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది.
2025 బడ్జెట్ స్వర్ణ ఆంధ్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. అంత భారీ విద్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం. 2014 లో జరిగిన విభజన తగిలిన మొదటి దెబ్బ ఐతే 2019-2024 గత ప్రభుత్వ దుష్పరిపాలన మరో పెద్ద షాక్. అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు.
