సోషల్ మీడియా వల్ల పిల్లలు డిప్రెషన్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సోషల్ మీడియాపైన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసే చట్టం ప్రభుత్వం తీసుకురావాలని ఆయన కోరారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
సోషల్ మీడియా వల్ల పిల్లలు డిప్రెషన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. శాసనమండలిలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు సోషల్ మీడియాను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే 16 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. దీనిపైన ఒక చట్టం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలు సైకలాజికల్ గా డిప్రెషన్ కి గురవుతారు. ఈ సోషల్ మీడియా మీద ఒక తీవ్రమైన చట్టం తీసుకురావాలి. అవగాహన కార్యక్రమం చేయటం ఎంత ముఖ్యమో అంతకుమించి చట్టం తీసుకుని వస్తే భయం ఉంటుంది. స్కూల్స్ లో టాబ్స్ ఇచ్చే దాంట్లో ఎడ్యుకేషన్ కె సిట్ అయ్యే పరిస్థితి ఉండాలి తప్ప అంతకుమించి వెళ్లకుండా ఒక మోనిటరింగ్ వ్యవస్థ కావాలి. అని కొణిదెల నాగేంద్రబాబు గారు పేర్కొన్నారు.
