సంస్కారం ఉన్న వ్యక్తి అంబటి : మాజీ సీఎం వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం జరిగింది. అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి జగన్ పరామర్శించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి చేతనైతే అంబటిని పొగడాలి అని చెప్పి జగన్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
సంస్కారం ఉన్న వ్యక్తి అంబటి
అంబటి రాంబాబు పెద్ద మనిషి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి, నేను తిట్టకుండా ఉండాల్సింది అని అంబటి చింతిస్తూ చెప్పారు. అంబటి మీద దాడులు జరుగుతున్న అందరు కలిసి తిడుతున్న భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు వివరణ కూడా ఇచ్చాడు.
అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. వాళ్ళు ఆయనని తిట్టినా దానికి ఆయన కార్ పైన దాడి చేసిన దానికి భావోద్వేగంలో ఆయన రెండు మాటలు తిట్టిన కూడా తర్వాత అంబటి చింతిస్తూ క్షమాపణ కూడా చెప్పాడు. చేతనైతే చేసిన మంచి పనికి పొగడాలి. కానీ వీళ్ళు దాన్ని వక్రీకరిస్తూ, దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబుని హత్య చేయడానికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు దాడి చేశారు. అని వైస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు.
