శ్రీశైలం లడ్డులోను కల్తీ నెయ్యి చేసిన జగన్ : ఇప్పటికే ఇండియా మొత్తం తిరుమల మహా ప్రసాదం అయిన లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. 2019-2024 మధ్య వైసీపీ పాలనలో కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని సిట్ ఛార్జ్ షీట్ లో తెలిపింది. ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే శ్రీశైలం మల్లిఖార్జున స్వామి కూడా లడ్డులో కల్తీ నెయ్యి వాడారంటూ సోషల్ మీడియాలో న్యూస్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
శ్రీశైలం లడ్డులోను కల్తీ నెయ్యి చేసిన జగన్
శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్ కలిపిన జగన్ మహా పాపం శ్రీశైలంలోనూ వైసీపీ పాలనలోనే జరిగింది. మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేశారు జగన్ గ్యాంగ్. 2022 మే నుంచి 2023 మార్చి వరకు 3,25,064 కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. రాజేష్ కార్పొరేషన్ సప్లై చేసింది. కల్తీ నెయ్యి బోలె బాబా డైయిరీది.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కాదు అందులో నెయ్యి లేదని, పామాయిల్, ఫిష్ ఆయిల్, జంతు కొవ్వులు మరియు పంది కొవ్వులు ఉన్నట్లు NDDB ల్యాబ్ రిపోర్ట్ లో స్పష్టంగా నిర్దారణ అయ్యింది. ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ కూడా లడ్డు కల్తీ చేశారంటున్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నాయి.
