శ్రీశైలంలో శివ స్వాములపై పోలిసులు లాఠీ ఛార్జ్ : శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీశైలం ఆలయంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. శివ స్వాముల పైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి గారు తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
శ్రీశైలంలో శివ స్వాములపై పోలిసులు లాఠీ ఛార్జ్
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు అయ్యాయి. భక్తులు వేలాదిమంది తండోపతండోపలుగా మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం వస్తారు. ఎక్కువగా శివ మాల వేసుకున్న స్వాములు కూడా ఏటా ఇక్కడికి భారీగా తరలివస్తారు. కానీ ఈసారి శివ స్వాముల పైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా గారు స్పందించారు.
రోజా మాట్లాడుతూ… దేవుడంటే భయం లేదు. భక్తులంటే గౌరవం లేదు.ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేదు. అసలు భక్తికి విలువే లేదు. రౌడీమూకల అరాచకాలను చోద్యం చూసిన పోలీసులు.. శ్రీశైలంలో మాలవేసుకొన్న శివస్వాములు, సామాన్య భక్తులపై మాత్రం లాఠీలు జులడం హేయమైన చర్య. మాలవేసుకొని దీక్షలో ఉన్న శివస్వాములను శ్రీశైలం ఆలయం వద్ద లాఠీలతో కొడుతున్న పోలీసుల తీరు భాధాకరం. ఇది రాక్షస పాలనకు నిదర్శనం.
వైసిపి నాయకుల ఇండ్లపై రౌడీమూకలు దాడి చేసినప్పుడు, పెట్రోల్ బాంబులు విసిరినప్పుడు, కార్లు, ఇండ్లు ద్వంసం చేసినప్పుడు లేవని లాఠీలు ఇప్పుడు ఎందుకు లేస్తున్నట్లో, రౌడీలు, గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే చేతులు ముడుచుకొని చేతగాని దద్దమ్మల్లా చోద్యం చూసిన పోలీసులు, ఇప్పుడు సామాన్య భక్తులపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. లాఠీలతో చావ బాదుతున్నారు.
రౌడీలంటే భయమా, లేక వారు పచ్చ పార్టీవాళ్ళన్న గౌరవమా గూండాలకున్న విలువకూడా భక్తులకు లేదా ఇదేనా పాలన అంటే ఇదేనా పోలీసు రాజ్యం అంటే రౌడీలముందు చేతగాని దద్దమ్మల్లా నిల్చొని, నిష్టతో వచ్చే భక్తులపై మాత్రం కర్కశంగా ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయం.
పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా తయారవడానికి ప్రభుత్వ తీరే కారణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇకనైనా పోలీసులు ప్రజలకోసం పనిచేయండి. పాలకులకు ఊడిగంచేయడం మానండి.
సనాతన ముసుగులో నటించడం కాదు. దేవుడి పేరుచెప్పి బ్రష్ట రాజకీయాలు చేయడం కాదు. నిజమైన భక్తులను గౌరవించడం నేర్చుకోండి.
