Reddeppagari Madhavi Reddy : వీపులు ముఖాలు పై జగన్ టాటూ వేసుకోండి.. మాధవిరెడ్డి షాకింగ్ కామెంట్స్

  • వీపులు ముఖాలు పై జగన్ టాటూ వేసుకోండి
  • బాత్ రూమ్ లోను స్కూల్ పిల్లలు తినే ప్లేట్, వాడే మగ్గుల పైన కూడా జగన్ ఫోటో
  • పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ ఖర్చు 20 కోట్లు
  • కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం జరిగింది

వీపులు ముఖాలు పై జగన్ టాటూ వేసుకోండి : కూటమి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏం వ్యాఖ్యలు చేశారంటే వైసిపి కార్యకర్తల వీపులు ముఖాల పైన జగన్ టాటూ వేసుకోమను అని మాధవి రెడ్డి గారు చెప్పారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

వీపులు ముఖాలు పై జగన్ టాటూ వేసుకోండి

అసలు ఈ వివాదం ఎక్కడ మొదలు అయ్యింది అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల పాస్ పుస్తకాల పైన ఆయన బొమ్మ వేసుకోవడం జరిగింది. అంతే కాకుండా రైతుల భూముల్లో సర్వే రాళ్ల పైన కూడా జగన్ బొమ్మను వేశారు. అది చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు కలిసి వ్యతికరేకించారు. ఎందుకంటే మా భూముల పైన మా నాన్న లేకపోతె మా తాత గారి ఫోటో ఉండాలి కానీ జగన్ ఫోటో ఎందుకు అని రాష్ట్రంలోని ప్రజలు అంత వ్యతిరేకించారు.

కూటమి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో పలు ఆసక్తికర అంశాలపైనా ఆమె మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా సర్వే రాళ్ల పై జగన్ బొమ్మ వేసుకున్నారని ఆయన బొమ్మ వేసుకోవడానికి ఎవరు అని ఆమె ఖండించారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తల అందరికీ టాటు వేసుకో వాళ్ళ మోకాళ్ళ మీదనో వీపుల మీదనో చేతుల మీదనో అంతేగాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటు వేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందు కాను నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లల్లోకి చేరాలనే ఒక దురుద్దేశంతో ఇలా చేశావని మాధవిరెడ్డి గారు వ్యాఖ్యానించారు.

స్కూల్ పిల్లలు తినే ప్లేట్, వాడే మగ్గుల మీద కూడా జగన్ ఫోటో

చివరికి బాత్ రూమ్ లో నీ ఫోటో, స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావ్. దాని యొక్క పరాకాష్టే 2024 వ ఎలక్షన్ యొక్క ఫలితాలు అని మాధవి రెడ్డి గారు తెలిపారు.

పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ ఖర్చు 20 కోట్లు

ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టదారి పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. ఆయన చేసిన దుర్వినియోగాలు 20 కోట్లు చాలా తక్కువ కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇదిగా ఇది ప్రజలందరూ గుర్తించినారు. అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు అని మాధవి రెడ్డి గారు తెలిపారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment