Vangalapudi Anitha : లోకేష్ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి.. వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు

లోకేష్ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి : ఆంధ్రప్రదేశ్ విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారు రాజకీయ చరిత్రలో ఒక నూతన ఒరవడి సృష్టించారని వంగలపూడి అనిత గారు ఆమె ట్విట్టర్ X లో తెలియజేశారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

లోకేష్ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ మరియు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులతో జిల్లాల వారీగా రోజుకో జిల్లా చొప్పున ఉండవల్లి నివాసంలో విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళతో నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని కాసేపు సరదాగా గడుపుతున్న మంత్రి నారా లోకేష్ గారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

తాజాగా అనకాపల్లి జిల్లా సభ్యులను నారా లోకేష్ గారు కలవడం జరిగింది. వంగలపూడి అనిత గారు ఫోటోలను ట్విట్టర్ X వేదికగా పంచుకున్నారు. అందరితో సరదాగా గడుపుతూ కలిసి భోజనం చేసి అందరం ఒకే కుటుంబమన్న భావన కల్పించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక నూతన ఒరవడి,ఇంతటి ఆత్మీయత పంచే నాయకులు, పార్టీతో ప్రయాణం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నా అని వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు.

Leave a Comment