లోకేష్ ని జనసేన పార్టీ అభినందిస్తుంది : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడవరోజు ప్రారంభమయ్యాయి. మూడవరోజు అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్. విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారిని అభినందించిన జనసేన పార్టీ అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
లోకేష్ ని జనసేన పార్టీ అభినందిస్తుంది
మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి విద్య శాఖల మంత్రి నారా లోకేష్ గారిని అభినందించాలి. ఆయన కూడా పెట్టుబడుల విషయంలో రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే విషయంలో ఆయన చేస్తున్న కృషిని జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అని మనోహర్ గారు పేర్కొన్నారు.
ఈ ఆలోచనతో పాటు వర్తమాన రాజకీయాల్లో ఎవ్వరు ఊహించిన విధంగా ఎవ్వరు ఆలోచించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సావరిన్ ఫండ్ 100 కోట్ల రూపాయలు తోటి మొట్టమొదటి సారి భారతదేశంలో ఇటువంటి ఆలోచన తోటి ఆయన ప్రతిపాదించిన సావరిన్ ఫండ్ ని బడ్జెట్ లో ప్రవేశపెట్టడం అనేది మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
