Mega Job Mela : లోకేష్ అన్నకు థాంక్స్.. ఆళ్లగడ్డ ఆడబిడ్డలు సత్తా చాటారు

లోకేష్ అన్నకు థాంక్స్ : టిడిపి ప్రభుత్వం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆళ్లగడ్డ ఆడబిడ్డలు సత్తా చాటారు. ఆళ్లగడ్డ ఆడబిడ్డలు విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ గారికి థాంక్స్ చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

లోకేష్ అన్నకు థాంక్స్

భూమా అఖిల ప్రియా మాట్లాడుతూ… మంత్రివర్యులు నారా లోకేష్ అన్న పుట్టినరోజు కానుకగా, ఆళ్లగడ్డ ఆడబిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం TATA కంపెనీలో 2000 ఉద్యోగ అవకాశాలతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం.

ఆళ్లగడ్డ నియోజకవర్గ ఆడబిడ్డలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సొంత కాళ్లపై నిలబడి మీ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బంగారు భవిష్యత్తుకు ఈ ఉద్యోగ మేళా ఒక గొప్ప ఆరంభం కావాలి.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఆళ్లగడ్డ యువత కోసం, ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహించింది. ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన ఆళ్లగడ్డ యువతులకు, ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయటమే కాకుండా, ఒక పెద్ద అక్కలా అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్న ఎమ్మెల్యే భూమ అఖిల గారు. మొదటిసారి ఉద్యోగానికి పోయేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పినట్లు చెప్పి పంపుతున్న అఖిల ప్రియా.

ఇటీవల ఆళ్లగడ్డలో మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో కేవలం ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సి ఉండగా వారి భద్రత కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేసి వారితో ఒక కానిస్టేబుల్ పంపించి వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పి ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నా వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి పంపిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.

Leave a Comment