Harish Rao : రేవంత్ రెడ్డి మెదక్ వస్తా లేడు ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు

రేవంత్ రెడ్డి మెదక్ వస్తా లేడు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మెదక్ వస్తా లేడు ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు. అని హరీష్ రావు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

రేవంత్ రెడ్డి మెదక్ వస్తా లేడు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మెదక్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు హరీష్ రావు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని పక్కల పోయిండు కానీ మెదక్ జిల్లాకు రాలేదు. మెదక్ రమ్మంటే వస్తా లేదు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు. ఇక్కడ ఎలాగో గెలిచేటట్టు లేదని రేవంత్ రెడ్డి రాలేదు. అని హరీష్ రావు గారు అన్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

కాంగ్రెస్ వాళ్ళు మెదక్ రమ్మంటే, మీ మొఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్టు లేరు రా నేను రాను మెదక్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. మెదక్ వచ్చే మొఖం లేదు రేవంత్ రెడ్డికి, మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊరికే ఉంటదా, మా కొమరెల్లి మల్లన్న ఊరికే ఉంటాడా, దేవుల్లను మోసం చేసి మొఖం లేక రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు రాలేదు అని హరీష్ రావు గారు పేర్కొన్నారు.

Leave a Comment