Chandrababu : రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ప్రపంచానికి అందిస్తాం

రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ప్రపంచానికి అందిస్తాం : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు అమరావతిలో మంత్రులు మరియు కార్యదర్శులతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అంతే కాకుండా ఈ రెండేళ్లలో ఇచ్చిన పథకాలు హామీలు అలాగే రాబోతున్న రోజుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించి మాట్లాడుతూ పలు కీలక అంశాలను ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా అమరావతి నుంచే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ప్రపంచానికి అందిస్తాం అనే అంశాన్ని చంద్రబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ప్రపంచానికి అందిస్తాం

అమరావతిలో ఫిబ్రవరి 7 2026 వ తేదీన క్వాంటం వ్యాలీ భవనాల శంకుస్థాపన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అందరికి తెలిసిందే. ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆనాడు హైటెక్ సిటీలో ఐటి విప్లవాన్ని స్థాపించాడు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను స్థాపిస్తున్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

చంద్రబాబు మాట్లాడుతూ… మన దేశంలో క్వాంటం సెంట్రిక్ గా అమరావతి. టెక్నాలజీలో ఎక్కడ వెనకబడి లేము రెండు సంవత్సరాలలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటం కంప్యూటర్స్ మరియు డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెను మార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడం కానివ్వండి. డే టు డే లైఫ్ వాడుకునే పరిస్థితికి వస్తా ఉంది.

Leave a Comment