- 20 వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ఆ 2 వేల కోట్లు ఖర్చు చేసిన జగన్ రాయలసీమ బిడ్డనా
- హంద్రీనీవా ప్రాజెక్ట్ కరెంటు బిల్లులు కట్టని జగన్
రాయలసీమ బిడ్డ జగన్ కాదు చంద్రబాబు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ బిడ్డ అంటే జగన్ కాదు చంద్రబాబు నాయుడు గారని కాల్వ శ్రీనివాసులు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
రాయలసీమ బిడ్డ జగన్ కాదు చంద్రబాబు
కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… 2014-2019 మధ్య కాలంలో హంద్రీనీవా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 4182 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల కాలంలో 3870 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆరు నర్ర సంవత్సర కాలంలో ఒకే ఒక్క పథకం పైన 8052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గొప్ప ప్రభుత్వం. ఈరోజు రాయలసీమలో వైసిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ల పైన నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక్క ప్రాజెక్ట్ పైన 8052 కోట్లు ఖర్చు చేశాం.
రాయలసీమ మొత్తం ప్రాజెక్టుల పైన 2014-2019 మధ్య కాలం 14,191 కోట్లు ఖర్చు పెడితే, ఈ 20 నెలల కాలంలో 8 వేల కోట్లు ఖర్చు చేశాం. మొత్తం ఆరు నర్ర సంవత్సర కాలంలో 22,243 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పాలనలో కేవలం 2010 కోట్లు ఖర్చు చేశారు.
ఈరోజు వైసిపి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశారని అంటారు. 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు రాయలసీమ బిడ్డనా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదికూడా హంద్రీనీవా అత్యంత ప్రధానమైన ప్రాజెక్ట్ కు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా, జరుగుతున్నా వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తాను అని నమ్మించి ఐదు సంవత్సరాల నయవంచనకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డనా ఆలోచన చేసుకోమని రాయలసీమ వాసులకు తెలియచేస్తున్నాను.
