Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

యువత వ్యవసాయం వైపు మరలాలి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. యువత వ్యవసాయం వైపు మరలాలి. రైతును రాజుగా చేసే పంచసూత్రాలను గురించి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

యువత వ్యవసాయం వైపు మరలాలి

యువత వ్యవసాయం వైపు మరలాలి. అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయటానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలు అయిన 1. నీటి భద్రత, 2. డిమాండ్ ఆధారిత పంటలు, 3. అగ్రిటెక్, 4. ఫుడ్ ప్రాసెసింగ్, 5. ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైన సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఏఐ, డ్రోన్స్, రోబోటిక్స్ ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికం ద్వారా వ్యవసాయాన్ని లాభాసాయకంగా మార్చడానికి అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దెందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశా నిర్దేశం చేస్తున్నారు. అని కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు.

Leave a Comment