బండ్ల గణేష్ కు కంగ్రాట్స్ చెప్పిన చంద్రబాబు : సినీ నిర్మాత బండ్ల గణేష్ కి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారిని బాగా అభిమానించే వ్యక్తుల్లో ముందు వరుసలో బండ్ల గణేష్ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు బండ్ల గణేష్ కు కంగ్రాట్స్ చెప్తూ ట్విట్టర్ X లో ట్వీట్ వేశారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
బండ్ల గణేష్ కు కంగ్రాట్స్ చెప్పిన చంద్రబాబు
వైసిపి ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైలు లో పెట్టిన విషయం అందరికి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా బయటికి తిరిగి వస్తే నా గడప నుంచి నీ గడపకు వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న బండ్ల గణేష్. తాజగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసుని కొట్టివేయడం జరిగింది.
అనుకున్నట్టుగానే బండ్ల గణేష్ షాద్ నగర్ తన నివాసం నుంచి తిరుమలకు కాలినడకన 23 రోజుల్లో స్వామి వారి దగ్గరికి చేరుకొని మొక్కు చెల్లించుకున్నారు.మొక్కు చెల్లించుకొని వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బండ్ల గణేష్. అలాగే స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన బండ్ల గణేష్.
చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ X లో ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ లో చంద్రబాబు గారు ఇలా రాశారు. తిరుమలకు కాలినడకన వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు, నిర్మాత బండ్ల గణేష్ గారు నన్ను కలిసి లడ్డూ ప్రసాదం అందించారు. ఏడుకొండలవాడిపై ఆయనకు ఉన్న భక్తి, నాపై చూపిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించాయి. తాను అభిమానించే వారికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకుని.. ఆ మొక్కును తీర్చుకున్న గణేష్ గారికి అభినందనలు.
