పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు ఇవ్వాలి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో పెన్షన్ ల పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకి వెంటనే పెన్షన్ అందజేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కొండపల్లి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు ఇవ్వాలి
కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… చేనేత కార్మికులు గాని వికలాంగులు గాని మత్స్యకారులు గాని కళ్ళు గీత కార్మికులు గాని వీళ్ళలో ఎవరైనా పెన్షన్ పొందుతున్న పురుషుడు చనిపోతే భార్యకి వెంటనే అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ 2024 న వితంతు పెన్షన్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైనా పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే భార్యకి మంజూరు చేయమని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
ఆర్టీజిఎస్ డేటా బేస్ నుంచి సర్వే చేస్తే మొదటగా నవంబర్ 2023 నుంచి సూమారు 50 వేల మందికి పెన్షన్ ఇవ్వలేదని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే మేము ఆర్టీజిఎస్ డేటా బేస్ సర్వే చేసి సూమారు 3 లక్షల మంది గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయి ఉన్నారు. వాళ్ళ భార్యకి ఇంకా పెన్షన్ రావట్లేదని డేటాలో తెలిసింది.
వెంటనే జిఎస్డబ్ల్యూ ద్వారా సర్వే చేయించి ఈ 3 లక్షల మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారని వెరిఫై చేయగా సూమారు 1 లక్ష 10 వేల మంది రావడం జరిగింది. గత ప్రభుత్వంలో అర్హులైన వ్యక్తులకు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సకాలంలో పెన్షన్ తీసుకోలేదు. కాలం చేశారు. అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోవడం జరిగింది. అని కొండపల్లి శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించారు.
