పుష్ప స్టైల్ సైగలు చేస్తూ రెచ్చిపోతున్న అంబటి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత. అంబటి జైలు బయట పుష్ప సినిమా స్టైల్ సైగలు దేనికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. అలంటి వ్యక్తి గురించి ఈ పవిత్రమైన సభలో మాట్లాడటం అవసరమా అని వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
పుష్ప స్టైల్ సైగలు చేస్తూ రెచ్చిపోతున్న అంబటి
వంగలపూడి అనిత మాట్లాడుతూ… అంబటి రాంబాబు గారి తల్లిని గురించి మాట్లాడారని ఆధారాలు ఇవ్వండి. ఇమ్మీడియేట్ గా ఆక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. ఇవ్వమనండి ఆధారాలు ఇదే అంబటి రాంబాబు బయటికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి, మళ్ళీ బయటికి వచ్చి క్షమాపణ చెప్తున్నారని చెప్పారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశ్యమే అయితే విత్ ఇన్ పావుగంటలో వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేడు ఏ పోలీసోడు వస్తాడో రమ్మను అని చెప్పినప్పుడు ఆ మాటలు ఎవరి గురించి మాట్లాడినట్టు.
ఇలా రెచ్చగొట్టినట్టు మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్లి పుష్ప సినిమా స్టైల్ లో సైగలు చేస్తాడు. అంబటి మాజీ మంత్రి ఏం సైగలు చేస్తున్నారు. సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి చర్చల సభలో అవసరమా, అలాంటి వ్యక్తి అనకూడదు కానీ తల్లిని చెల్లిని గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఈ చర్చల సభలో ఇంత చర్చ అవసరమా అతన్ని వెనుకేసుకొని రావడం అవసరమా అసలు మీకు ఏమైనా సెన్స్ ఉందా అని నేను అడుగుతున్నా అని వైసిపి వాళ్ళని నిలదీసిన వంగలపూడి అనిత.
