Anagani Satya Prasad : పాస్ బుక్ జగన్ దిష్టి బొమ్మ VS రాజముద్ర

పాస్ బుక్ జగన్ దిష్టి బొమ్మ VS రాజముద్ర : కూటమి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు జగన్ పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే జగనన్న ప్రభుత్వంలో పాస్ బుక్ పైన జగన్ బొమ్మ ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పాస్ బుక్ పైన రాజముద్ర బొమ్మ ఉంటుంది. పాస్ బుక్ పైన జగన్ దిష్టి బొమ్మ న రాజముద్ర నా అంటే ప్రజలు రాజముద్ర నే కోరుకుంటారని అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

పాస్ బుక్ జగన్ దిష్టి బొమ్మ VS రాజముద్ర

పాస్ బుక్ జగన్ దిష్టి బొమ్మ VS రాజముద్ర
పాస్ బుక్ జగన్ దిష్టి బొమ్మ VS రాజముద్ర Image Source : X / YSR Congress Party

మాజీ సీఎం అలియాస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వం పని తీరు పట్ల తీవ్ర విమర్శలు జగన్ చేశారు. అందులో ముఖ్యంగా పాస్ బుక్ లో జగన్ బొమ్మ ఉంటె తప్పేంటి అంతే కాకుండా భూ రక్ష రాళ్లను కూడా తొలగిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా పాస్ బుక్ లో క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకోని వచ్చాం. అన్నిటిని క్రెడిట్ చోరి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని జగన్ మండిపడ్డారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

దానికి సమాధానంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం ఇక్కడ రెండు పుస్తకాలు వ్యత్యాసం చూడండి ఒక దాంట్లో దిష్టి బొమ్మ ఒకదాంట్లో రాజముద్ర ఎవరు ఏది కోరుకుంటారు. రాజముద్రనే కోరుకుంటారు దీంట్లో మీరు చూడండి పట్టదారి ఫోటో లేదు ఆయన ఫోటో మాత్రమే ఉంది. ఎందుకండీ ఆయన ఫోటో ఎవరికి కావాలండి మా తల్లిదండ్రులదో మా తాతలదో ముత్తాతలదో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేదో కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకోవాలి కానీ జగన్ ఫోటో ఎందుకండి.

పాస్ బుక్ లో ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమి లేవు. జగనన్న ఫోటో మాత్రం ఉంది. అలాగే జిపిఎస్ సిస్టం కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున రాజముద్రతో వారి భూమి వారి హక్కులాగా అంటే మీ భూమి, మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ అలాగే ఎన్ని ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తది అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికీ గ్రామసభలు పెట్టి మేము చేశం.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

ఏమైనా అంటే క్రెడిట్ చోరి అంటారు

ఈరోజు Google రానియండి టిసిఎస్ రానియండి లేకపోతే కాగ్నిసెంట్ రానియండి ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీ అంటాడు. మాకు కావాల్సింది అభివృద్ధి మాకు కావాల్సిన సంక్షేమం మాకు కావాల్సింది హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ దానికోసం తపన పడుతుంది కూటమి ప్రభుత్వం. అరాచకాలు విద్వంసాలు సృష్టించడమే జగన్ లక్ష్యం. అని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Leave a Comment