- పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా జగన్
- ఎన్ని పాదయాత్రలు చేసిన నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు
- వైసిపి కార్యకర్తలు కూడా మా కూటమికి ఓట్లు వేశారు
- తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి
పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా జగన్ : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే జగన్ పాపాలు చేసి పాదయాత్ర చేస్తే పోతాయా అని బుడ్డా రాజశేఖరరెడ్డి గారు వ్యాఖ్యానించారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా జగన్
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలం టెంపుల్ కి వెళ్లడం జరిగింది. దర్శనం అయ్యాక మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా జగన్ పైన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటంటే పాపాలు చేసి పాదయాత్ర చేస్తే పోతాయా నిన్ను జనం పట్టించుకునే వాళ్ళే లేరు. ఎన్ని పాదయాత్రలు చేసిన ఏం చేసిన నీ పాపాలు వెంట వస్తూనే ఉంటాయి. నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. జనాలు నిన్ను పట్టించుకునే పరిస్థితిలో లేరు కాబట్టే ప్రజల్లోకి వెళ్తా అంటున్నవ్. ఏం తక్కువ అయ్యిందని నువ్వు పాదయాత్ర చేస్తావ్ అని బుడ్డా రాజశేఖరరెడ్డి గారు అన్నారు.
వైసిపి కార్యకర్తలు కూడా మా కూటమికి ఓట్లు వేశారు
ఈరోజు 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చారు అంటే దాంట్లో నీ కార్యకర్తలు కూడా ఉన్నారు అది అర్థం చేసుకో ముందు, మీ వైసిపి కార్యకర్తలు కూడా మా కూటమికి ఓట్లు వేశారు. నీ 151 సీట్లు పడిపోయి మాకు 164 సీట్లు అది కూడా అఖండ మెజారిటీ తోటి వచ్చాయి. నీ కార్యకర్తలు కూడా ఓట్లు వేసినారు. అది నీకు తెలియడం లేదు. ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావ్.
పాదయాత్ర ప్రజల కోసం చేస్తున్నావా నీ కార్యకర్తల కోసం చేస్తున్నావా అది జగన్మోహన్ రెడ్డినే అడగాలి. అధికారం రాక ముందు ప్రజలకు మేము అయితే ఏం మాట ఇచ్చామో సూపర్ సిక్స్ కానీ మెగా డిఎస్సి కానీ చాలా ఇస్తూనే ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉన్న సరే అన్ని ఇస్తున్నాం. పోయిన మీ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ కడుక్కుంటూ మా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు సక్రమంగా నిర్వహిస్తా ఉందని బుడ్డా గారు తెలిపారు.
తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి
వైసిపి ప్రభుత్వంలో శ్రీశైలం దేవాలయానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దేవాలయాల పట్ల సంప్రదాయాల పట్ల వైసీపీ పార్టీ తీరు ఏ విధంగా ఉండిందో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల దేవస్థానంలో అక్రమాలు కోకొల్లలు. ప్రధానంగా తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళు కల్తీ నెయ్యే కాకుండా మాంసపు కృతులు వాడారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు.
ఎన్ని అరాచకాలు పాల్పడ్డారు. సిట్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అది కల్తీ నెయ్యి అని ఫైనల్ ఛార్జ్ షీట్ లో తేలింది. కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా మా మీద కేసులు పెట్టారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. పాపాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలని వాళ్ళకి లేదు. కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో పూజలు చేసి ఆ పాపాల్ని ఆ దరిద్రుల నుంచి మనం అయిన కడుగుదామని ఇవాళ శుద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని బుడ్డా గారు వ్యాఖ్యానించారు.
