Nara Lokesh : నిమ్మల రామానాయుడు ని ఎగతాళి చేసిన సైకో జగన్

  • నిమ్మల రామానాయుడు ని ఎగతాళి చేసిన సైకో జగన్
  • భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు
  • ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం
  • దీపం పథకం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి
  • మెగా డిఎస్సి మరియు కానిస్టేబుల్ పోస్టులు

నిమ్మల రామానాయుడు ని ఎగతాళి చేసిన సైకో జగన్ : ఆంధ్రప్రదేశ్ ఐటి విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ గారు జగన్ ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో అని అంతే కాకుండా ఆనాడు మంత్రి నిమ్మల రామనాయుడుని జగన్ ఎగతాళి చేశారని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

నిమ్మల రామానాయుడు ని ఎగతాళి చేసిన సైకో జగన్

మంత్రి నారా లోకేష్ కాకినాడ పర్యటన వెళ్లడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు మరియు నేతల సమావేశంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఆనాడు ఎగతాళి చేసిన వ్యక్తి సైకో జగన్ అని లోకేష్ గారు అన్నారు. ఎవ్వరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్లొద్దు అని లోకేష్ గారు అన్నారు.

అసలు విషయం ఏంటంటే ఆనాడు 2024 ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆయన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందికి తల్లికి వందనం ఇస్తుంది కూటమి ప్రభుత్వం అని ఆయన చెప్పడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారిని ఆ విషయం పట్లనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందికి తల్లికి వందనం వేయటం జరిగింది.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం

నారా లోకేష్ గారు మాట్లాడుతూ… మీ అందరికీ తెలుసు గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు. అదే ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం ₹4000 రూపాయలు పెన్షన్ అందజేశం. వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు.

తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం మనందరం కలిసి గట్టిగా డోర్ టు డోర్ తిరిగే హామీ ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం ఇచ్చి చూపించాం.

దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అంద చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ రెండు విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేశాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పించడం జరిగింది.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

మెగా డిఎస్సి మరియు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం

నాతో ఎంతో మంది అన్నారు. డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు. 1998 డిఎస్సి కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. మీరు ఎట్లా చేస్తారు అన్నారు. ఆనాడే చెప్పా నాకు ఛాలెంజ్ లు అంటే బాగా ఇష్టం 150 రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ ఇచ్చాము. సుమారుగా 220 కేసులు వేశారు డిఎస్సి పైన అయినా కూడా తొక్కుంటా వెళ్లి 16వేల ఉపాధ్యాయుల పోస్టులు ఈరోజు మనం భర్తీ చేశం.
అదేవిధంగా 6వేల మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశం అని నారా లోకేష్ గారు తెలిపారు.

Leave a Comment