తిరుమల కల్తీకి హెరిటేజ్ కి ఏం సంబంధం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైసిపి వాళ్ళ పైన ఫైర్ అయిన నారా చంద్రబాబునాయుడు. తిరుమల లడ్డు కల్తీకి హెరిటేజ్ కి ఏం సంబంధం అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
తిరుమల కల్తీకి హెరిటేజ్ కి ఏం సంబంధం
నారా చంద్రబాబు నాయుడు గారు వైసిపి చేస్తున్న విష ప్రచారం పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే వైసిపి వాళ్ళు హెరిటేజ్ కల్తీ అని ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు గారు తెలిపారు. వైసిపి వాళ్ళ బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ని ఎందుకు తీసుకోని వస్తారు. నాకేం అర్థం కాలేదని చంద్రబాబు గారు పేర్కొన్నారు.
ఇప్పుడు హెరిటేజ్ కి ఏం సంబంధమో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు చెప్పేవాణ్ణి నేను రాజకీయాల్లో ఉన్న మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా వాళ్లే వచ్చి డైరెక్ట్ గా లైన్ ఇచ్చి, కరెంటు ఇల్లీగల్ గా వాడుతున్నారని పరిస్థితి వస్తుందని మానేజ్మెంట్ కి చెప్పడం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… హెరిటేజ్ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అడిగింది లేదు. భవిష్యత్ లో కూడా అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా, అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద లైవ్లి వుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మానేజ్మెంట్ చేసుకుంటున్నారు. తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్న, దానికి ఒక పేపర్ ఉందని హెడ్ లైన్స్ లో ఇదే పెట్టే పరిస్థితికి వస్తున్నారు. వీళ్లకు ఏంటి అంటే డామేజ్ చేయటం. బ్రాండ్ డామేజ్ చేస్తే దాని వల్ల వాళ్లకు నష్టం వస్తుంది.
