Bandla Ganesh : టిడిపి కార్యకర్తలు సైనికులు.. ప్రాణాలు ఇచ్చిన కార్యకర్తలు రుణం తీర్చుకోలేరు

టిడిపి కార్యకర్తలు సైనికులు : సినీ నిర్మాత పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలా భావించే బండ్ల గణేష్ టిడిపి కార్యకర్తల పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే టిడిపి కార్యకర్తలు సైనికులు లాంటోళ్ళు, నాయకులూ ప్రాణాలు ఇచ్చిన కార్యకర్తల రుణం తీర్చుకోలేరు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

టిడిపి కార్యకర్తలు సైనికులు

బండ్ల గణేష్ సీఎం చంద్రబాబు నాయుడు గారి కోసం తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కు కోరుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే సంకల్ప యాత్ర రెండు వారాలు పైన అయ్యింది. బండ్ల గణేష్ గారు తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ అనేకమైన ఆసక్తికరమైన అంశాలను తెలియచేశారు. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇంటర్వ్యూ కే హైలైట్ గా నిలిచాయి.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఏ పార్టీకి లేనంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఉండటం సహజం. టీడీపీ పార్టీలో సైనికులు ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ భారతదేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులు లాంటి వాళ్ళు, కష్టం వచ్చిన నష్టం వచ్చిన రైట్ అయిన రాంగ్ అయిన చరిత్ర తీసుకోండి. 1983 నుంచి నాయకులు మారారు పదవులు అనుభవించిన వాళ్ళు మారారు. ఎంపీలు, మంత్రులు అయ్యి మారారు. అందరూ కూడా చంద్రబాబు గారితో లబ్ది పొంది మారారు.

ఏ లబ్ది పొందకుండా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీ కోసం ఫిరంగి పట్టుకొని నిలబడ్డ నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త. ఈ నాయకులందరూ కార్యకర్తలకి ఏం ఇచ్చి రుణం తీసుకోవాలి. వీళ్ళ ప్రాణాలు ఇచ్చిన కార్యకర్తలు రుణం తీర్చుకోలేరు. అంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అని బండ్ల గణేష్ గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment