Nimmala Rama Naidu : జగన్ భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి.. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష!

జగన్ భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి : ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే జగన్ అనే భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి అని మంత్రి రామానాయుడు గారు తెలిపారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

  • జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని సీసాలో పెట్టి బిగించాలి
  • జగన్ వస్తే అభివృద్ధి కాదు విద్వంసం చేస్తాడు
  • వైసిపి పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్
  • అబద్ధాలకు అసత్యాలకు ప్యాంట్ చొక్కా వేస్తే అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి
  • ఒక్క ఛాన్స్ అని ఇస్తే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు
  • ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే మొద్దు నిద్రపోయిన వ్యక్తి జగన్
  • ఇవాళ మేము అధికారంలో ఉన్నాం మేము రప్పా రప్పా అంటే మీ పరిస్థితి ఏంది

జగన్ భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… అరుంధతి సినిమాలో పశుపతి అరుస్తూ ఉంటాడు బయటికి తీసుకోని రమ్మని, బయటికి వచ్చాక కక్ష తీర్చుకోవాలని చెప్పి పశుపతి అనుకుంటాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు కోసం అంటే జగన్ అభివృద్ధి చేయటం కోసం కాదు విద్వంసం చేయటం కోసం వస్తా అంటున్నాడు.

2024 లో జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని సీసాలో పెట్టి బిగించాం. రేపు భవిష్యత్ లో కూడా ఎప్పుడు కూడా ఆ సీసాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భూతాన్ని బయటికి రాకుండా సీసాలో బిగించి పెట్టాలి. ఆ సీసాని బిగించి ఉంచాలి అదే రాష్ట్రానికి శ్రీరామ రక్షా.

అబద్ధాలకు అసత్యాలకు ప్యాంట్ చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి

జగన్ భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి
జగన్ భూతాన్ని సీసాలోనే పెట్టి బిగించాలి Image Source : X / YSR Congress Party

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… వైసిపి పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అబద్ధాలకు అసత్యాలకు ప్యాంట్ చొక్కా వేస్తే అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు అబద్దాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టక పొతే 2019 లో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కానీ భావితరాల భవిష్యత్ కానీ మన పిల్లల భవిష్యత్ కానీ ఇంకా శూన్యం అయిపోయేటువంటి పరిస్థితి. ఒక్క ఛాన్స్ అని ఇస్తే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు.

మళ్ళీ ఇంకొక్కసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు భుజస్కంధాల పైన వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపు మళ్ళీ అంటున్నాడు ఒకటినర్ర సంవత్సరం తర్వాత జగన్ మళ్ళీ పాదయత్రకి వస్తా అంటున్నాడు.

జగన్ పాదయాత్ర అంటే ముద్దులు పెట్టడం తలలు నిమరడం

జగన్ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావ్. అంతకుముందు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి తలలు నిమిరి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్ర పోయావ్. ఐదు సంవత్సరాలలో అడపాదడపా ప్రజల దగ్గరికి రావాలంటే బారికేడ్లు పరదాలు కట్టుకొని 144 సెక్షన్ పెట్టుకొని వచ్చేవాడివి.

ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే మొద్దు నిద్రపోయిన వ్యక్తి జగన్. పోని ఈరోజు ప్రజల్లోకి వస్తానని చెప్పలేదు. 2029 లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే నడవటం ఎందుకు ఎన్నికల ముందు సంవత్సరంనర్ర తర్వాత వస్తా అంటే అక్కడే జగన్ మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని చెప్పాలి.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా లేదా బీహార్ రాష్ట్రంలో ఉన్నావా అర్థం అయేటువంటి పరిస్థితి కాదు. మూడు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా అని మీరంటే, ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కదా మీరు చేసే పని మేము ఈరోజు చేస్తే మీ పరిస్థితి ఏంటి. అంటే అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అని రామానాయుడు గారు వ్యాఖ్యానించారు.

Leave a Comment