జగన్ క్రెడిట్ ఎవరైనా తీసుకోగలుగుతారా? :టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన టీం ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఇంతకీ అప్పలనాయుడు జగన్ పైన ఏం వ్యాఖ్యలు చేశారో పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
జగన్ క్రెడిట్ ఎవరైనా తీసుకోగలుగుతారా?
టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాబాయి ని హత్య చేసిన క్రెడిట్ ఎవరైనా తీసుకోగలుగుతారా అలాగే తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటి బయట పంపించిన క్రెడిట్ ని ఎవరైనా తీసుకుంటారా ఈరోజు మూడు రాజధానుల పేరిట మూడు
ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరైనా తీసుకోగలుగుతారా తెలిసి తెలిసి ఇలాంటి క్రెడిట్స్ ఎవరైనా తీసుకోగలరా అంటూ అప్పలనాయుడు గారు జగన్ ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.
కోడిగుడ్డు అమర్నాథ్ చలి అని చెప్పి ఆనాడు వెళ్లని పరిస్థితి
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ… మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ దావోస్ వెళ్తే చలి అన్నాడు చలికి స్నానం చేస్తే జ్వరాలు వస్తాయని చెప్పి ఆరోజు వెళ్లలేని పరిస్థితి మళ్ళీ ఇవాళ ఏమో దావోస్ గురించి మాట్లాడుతున్నారు. అప్పడాలు బొబ్బట్లు పచ్చళ్ళ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్. ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన మరియు లోకేష్ గారి పైన లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు జగన్ అండ్ టీం.
జగన్ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు
కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రయత్నాన్ని ఆటంకం పరచడానికి ఈరోజు ఒక ప్రయత్నానికి మీరు ఒక అడ్డు పుల్ల వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరు అధికారంలో వచ్చే పరిస్థితి రాదు అది మీరు పగటి కల కంటున్నారు. చరిత్ర అందరికీ తెలుసు ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు విద్వంసం అన్నీ కూడా తెలుసు ఎవరు ఇచ్చే ఛాన్స్ లేదు.

ప్రపంచ దేశాలలో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్
కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ… ఈరోజు ఒక తెలుగువాడిగా ప్రపంచ దేశాలకి ఒక పరిచయస్తుడిగా చంద్రబాబు నాయుడు గారిని దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అంబాసిడర్ గా ఈరోజు అభివృద్ధికి ఉండి ఈరోజు వారిని ఆహ్వానిస్తే జగన్ నువ్వు కనీసం స్వాగతించకపోయి విమర్శలు చేసే పరిస్థితికి వస్తున్నారు.ఇదేమైనా తెలుగు ప్రజలకి అవమానం చేసినట్లగే రాష్ట్ర ప్రజానికానికి అవమానం చేసినట్లేగా ఈరోజు రాష్ట్ర ప్రజానికం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రంకి మేలు జరుగుతాది అని భావిస్తున్నారు.
బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కుట్రలు చేసి ఈరోజు సుట్టం సూపుగా తాడిపల్లి ప్యాలస్ కి వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లే సందర్భాలు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
