జగన్ కి ఎంతసేపు చావులు గొడవలు : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన కూటమి ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు. ఎంతసేపటికి ఎక్కడ చావులు ఉన్నాయి. ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడికి వెళ్లి పరామర్శ చేసి కాష్ చేసుకుందాం అని చూస్తుంటారు. అని మాధవి గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
జగన్ కి ఎంతసేపు చావులు గొడవలు
తాట తీస్తారు జగనన్న గారు, అసెంబ్లీలో తాట తీయమనండి. ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి. ఏదో మిమ్మల్ని అరకొర నమ్మి ప్రజలు 11 సీట్లు ఏదైతే ఇచ్చారో వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ చావులు ఉన్నాయి. ఎక్కడ ఘర్షణలు జరిగినాయి. అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్లి కాష్ చేసుకుందాం కాదు. ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ కోసం రండి మాట్లాడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఏదొక కాంట్రవర్సీ.
లోకేష్ అన్న గారు చెప్పారు. ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనకు చాలా చాలా భయంకరమైన బరువు బాధ్యత ఉంది. ఇప్పుడు కాదు టైం వస్తుంది అని లోకేష్ గారు చెప్తున్నారు.
కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేం. ఎక్కడ చలించలేదు. ఎవరిని అన్న ఏం మాట్లాడలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే స్కాం అని అంటున్న, ఆడవాళ్ళని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న, ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా కూడా మాట్లాడి మేము క్వశ్చన్ చేయకపోతే మరి మేము ఏం మెసేజ్ ఇచ్చినట్టు జనాలు అడుగుతారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకని, ఎలా పడితే ఆలా మాట్లాడనిచ్చినందుకా అని ప్రజలు మమ్మల్ని అడుగుతారు అని గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.
