- చంద్రబాబుని బండ బూతులు తిట్టిన అంబటి రాంబాబు
- వైసీపీ పార్టీలో ఉండే నాయకులు అంత భూతుల నాయకులు
- అసభ్య పదజాలంతో మాట్లాడటం చట్టరీత్యా నేరం
- అంబటి రాంబాబు వ్యాఖ్యలు ముమ్మాటికీ ఖండించదగినవి
చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి : మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి
వైసిపి పార్టీ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల్ని అడిగిన బూతులు మాట్లాడే పార్టీ ఏది అంటే అది వైసిపి పార్టీ అనే చెప్తారు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు అంత భూతుల నాయకులు సమాజంలో ఎలా మాట్లాడాలో తెలీదు. వీళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులు. మన కర్మ కాకపోతే ఇలాంటి వాళ్లంతా ఈ వైసిపి పార్టీలోనే ఉంటారు. అందులో ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు కొంచెం రెచ్చిపోయి మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని బండ బూతులు తిట్టారు.
ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలి.రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం, కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఉపయోగించిన భాష అత్యంత హేయమైనది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి బూతు పురాణం అందుకోవడం ప్రజాస్వామ్యానికే మచ్చ.
అంబటి రాంబాబు వాడిన పదజాలం కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, అది వ్యక్తిగత దూషణ మరియు అసభ్యతతో, సంస్కారహీనమైన భాషతో కూడుకున్నది. ఇది తెలుగు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉంది.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక పార్టీకి మాత్రమే కాకుండా, రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. అటువంటి గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా బూతులు మాట్లాడటం వ్యవస్థలను అగౌరవపరచడమే.
ప్రజల మధ్య విద్వేషాలను ప్రేరేపించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసభ్య పదజాలంతో మాట్లాడటం చట్టరీత్యా నేరం. సమాజంలో ఇలాంటి ధోరణిని అరికట్టాలంటే, ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయిన భాషలో హుందాతనం పాటించడం కనీస ధర్మం. అంబటి రాంబాబు వ్యాఖ్యలు ముమ్మాటికీ ఖండించదగినవి.
ప్రజాస్వామ్యంలో విమర్శకు తావుంది కానీ, విచ్చలవిడితనానికి కాదు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు సుమోటోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
దిగజారిపోయిన అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంతలా దిగజారి మాట్లాడటం కరెక్ట్ కాదు. వెంటనే ఆయన మాటలు వెనక్కి తీసుకోని సీఎం చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి కార్యకర్తలు మరియు నాయకులు అంబటి రాంబాబు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీఎం గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
