Margani Bharat : చంద్రబాబు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూస్తాడు

చంద్రబాబు క్షమాపణ చెప్తారా లేదా : వైసిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు గారి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నెయ్యి కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు అని ఎంపీ భరత్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

చంద్రబాబు క్షమాపణ చెప్తారా లేదా

మార్గాని భరత్ మాట్లాడుతూ… తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జంతువుల కొవ్వు అనేది కలవడం తిరుపతి నెయ్యిలో జరగలేదు అనేది ఇది నేను ఉద్గాటించి చెప్తున్నాను. చాలా మందికి మీకు బ్రెయిన్ లో నాటేశారు కదా అందులో అనిమల్ ఫ్యాట్ ఉందని, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోండి. సరే మీరు క్షమాపణ చెప్తారా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ముందు అయితే మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. నేను పొరపాటులో ఆ రిపోర్ట్ ఎదో వచ్చింది. ఆ రెపొర్ట్ని ఉద్దేశించి మాట్లాడాను. పొరపాటు అయ్యిందని మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు. దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదని సిబిఐ నిర్దారణ చేసింది. మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోమని వైసిపి పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.

Leave a Comment