Vangalapudi Anitha : అసెంబ్లీలో గవర్నర్ ని అవమానించిన వైసిపి సభ్యులు

అసెంబ్లీలో గవర్నర్ ని అవమానించిన వైసిపి సభ్యులు : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు మొదలు అయ్యాయి. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి గవర్నర్ గారు ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారిని అవమానించడానికే వచ్చిన వైసీపీ సభ్యులు అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

అసెంబ్లీలో గవర్నర్ ని అవమానించిన వైసిపి సభ్యులు

వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ… మా స్పీకర్ స్ట్రిక్ట్ గా ఉన్నారని వైసిపి వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతాదాని కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు షో అఫ్ చేయడానికి వైసిపి వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు. ఒక్క 10 నిముషాలు మినిమం గౌరవం లేకుండా, గవర్నర్ గారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లెజిస్లేటర్స్ మనపైన ఉంది. ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కూడా గవర్నర్ గారికి గౌరవం ఇస్తారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగితే గవర్నర్ గారిని కలుస్తాం అని చెప్పే ఈ పెద్దమనుషులు. అదే గవర్నర్ గారు అసెంబ్లీలో నిల్చొని ప్రసంగిస్తుంటే, రాకరాక వీళ్ళు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ మీద కాగితాలు విసిరి ఆయన్ని అవమానించేటట్టుగా మాట్లాడటం ఫిర్యాదు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది నేను సూటిగా ప్రశ్నిస్తున్న.

అసెంబ్లీకి ముందు రాము అని చెప్పారు. మళ్ళీ వాళ్లకు వాళ్లే డిసైడ్ అయ్యి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారో తెలీదు. ఎందుకు వెళ్లిపోయారో తెలీదు. గవర్నర్ గారిని అవమానించడానికి మాత్రమే ఈరోజు అసెంబ్లీకి వచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అవమానించడానికి వచ్చారు. అవమానించారు వెళ్లిపోయారు అంతే. అంతకుమించి అందులో ప్రజా ప్రయోజనము ఏం కనిపించలేదు. అని వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment