అమెరికాలోని న్యూస్ పేపర్ లో చంద్రబాబు : నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే అమెరికాలోని పెద్ద పెద్ద న్యూస్ పత్రికల్లో అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గురించి రాసే వాళ్ళని గాలి భాను ప్రకాష్ తెలిపారు. ఆ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అమెరికాలోని న్యూస్ పేపర్ లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నగరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు నగరి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారి స్పీచ్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇంతకీ భాను ప్రకాష్ గారు బాబు గారి గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ… నేను అమెరికాలో ఉండేవాడిని.అమెరికాలో ఉండేటప్పుడు ఒక ఫాసినేషన్ ఉండేది బాబుగారి గురించి ఎవరు చూసిన బాబుగారి గురించి మాట్లాడేవాళ్ళు అమెరికాలో అది కూడా అక్కడ పేపర్లో బాబుగారి గురించి రాసేవాళ్ళు న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద పేపర్లో కూడా బాబుగారి గురించి ప్రస్తావించేవాళ్ళు అప్పుడు అనుకునేవాడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది కూడా ఇండియాలో అక్కడ డెవలపింగ్ నేషన్ అంటారు మనల్ని అమెరికాలో అలాంటిది మన బాబుగారి గురించి అక్కడ విశిష్టంగా రాసేవాళ్ళు.
ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడర్ విజన్ ఉన్న లీడరు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడు. అని చెప్పి వాళ్ళు కోకొల్లలుగా అక్కడే రాసేవాళ్ళు అప్పుడు అనుకునే వాడిని అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారు. అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మన చేసుకున్న అదృష్టం.
దేశంలో చాలా పాలిసీలు బాబు గారు తెచ్చినవే
గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ… ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఇవాళ ఆదర్శంగా తీసుకొని చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నాం అంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలా మంది పట్టభద్రులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశ నిర్దేశం ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది వందల కాలేజీలు ప్రైవేట్ సెక్టార్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు.
కాబట్టి ఇవాళ ఎక్కడ చూసిన కూడా ఇంజనీర్లు ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతా ఉంది. మీరందరికి తెలుసు అలాగే మనం చూసాం ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బోల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం అన్నపూర్ణ అనేవాళ్ళం ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటి అంటున్నాం బిటీ అంటున్నాం ఫార్మా అంటున్నాం ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందు ఉందని చెప్పడానికి ఏకైక నిదర్శనం బాబు గారు.
