అబద్దాలలో జగన్ ని మించిపోయింది అక్క : మాజీ మంత్రి వైసిపి నాయకురాలు విడదల రజని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీలతో సంబంధం లేకుండా కింద మీద పడి నవ్వుతారు. మా వైసిపి హయాంలో ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ ప్లే చేశామా అని విడదల రజని పేర్కొన్నారు. అబద్దాలలో జగన్ ని మించిపోయింది అక్క అని రజని ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అబద్దాలలో జగన్ ని మించిపోయింది అక్క
విడదల రజని మాట్లాడుతూ… మా వైసిపి పార్టీ 5 ఇయర్స్ గవర్నమెంట్, మా జగనన్న నాయకత్వంలో విన్నారా ఇటువంటివి. ఇట్లాంటి చీఫ్ పాలిటిక్స్ ప్లే చేశామా, హింస హత్యాయత్నాలు దాడులు ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. చాలా పద్దతిగా ట్రాన్స్పరెంట్ గా గుడ్ గవర్నెన్స్ అందించాం. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించాం. ప్రజలు సంతోషంగా ఉండాలి అనుకున్నాం.
విన్నారుగా అక్క విడదల రజని వెర్షన్ అబద్దాలు ఎంత అవలీలగగా చెప్తుందో, అక్క ఇప్పుడైనా అబద్దాలు మాని నిజంలోకి రా లేకపోతే నీ కర్మ. అబద్దాలలో మీ నాయకుడు జగనన్న ని మించిపోయావ్ కదా అక్క.
1) చంద్రబాబు గారి నివాసంపై జోగి రమేష్ రాళ్ళ దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు.
2) మంగళగిరిలో కేంద్ర కార్యాలయంతో పాటు గన్నవరం,గుడివాడ పార్టీ ఆఫీస్ ల మీద దాడులు చేశారు.
3) అమరావతిలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు..
4) యర్రగొండపాలెంలో కాన్వాయ్ పై రాళ్ళ దాడిలో NSG కమాండో గాయపడ్డాడు.
5) విశాఖలో రౌడీలతో రాళ్ళ దాడి చేశారు.
6) తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో రాళ్ళ దాడి చేశారు.
7) చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో రాళ్ళ దాడి చేశారు.
8)నందిగామ నియోజకవర్గంలో కరెంటు ఆపేసి రాళ్ళ దాడి చేశారు.
9) పుంగనూరులో,అంగళ్ళ దగ్గర రాళ్ళ దాడి చేసి ఎదురు టీడీపీ కార్యకర్తల మీద వందల కేసులు పెట్టారు.అందుకే ఆ చిత్తూరు SP పోస్టింగ్ లేకుండా కూర్చున్నాడు.
10) అనపర్తిలో మీటింగ్ పెట్టకుండా అడ్డుకున్నారు..
11)భీమవరం లో యువగళం పాదయాత్ర మీద రాళ్ళ దాడి చేశారు.
12) పట్టాభి ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు.భార్య పిల్లల నీ భయభ్రాంతులను చేశారు.
ఇవి కొన్ని మాత్రమే చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. ప్రజలు మీ ఐదేళ్ల గవర్నమెంట్ లో సంతోషంగా ఉంటె మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసేవారు కాదు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అక్క. ఇట్లే ఇష్టానుసారంగా మాట్లాడతాను అంటే నిన్ను మార్చలేము. మీ నాయకుడు జగన్ ని మార్చలేం.
