Kinjarapu Atchannaidu : అన్నదాత సుఖీభవ 2026-27 బడ్జెట్ 6,600 కోట్లు

అన్నదాత సుఖీభవ 2026-27 బడ్జెట్ 6,600 కోట్లు : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 2026-27 సంవత్సరానికి గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించాం అని కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

అన్నదాత సుఖీభవ 2026-27 బడ్జెట్ 6,600 కోట్లు

ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో ప్రతిపాదించాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్నాము. గత ప్రభుత్వంలో, రైతుకు ఉన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాము. అని కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు.

Leave a Comment