- అసెంబ్లీ సాక్షిగా కంటతడి పెట్టిన చంద్రబాబు
- కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు
- చంద్రబాబు నాయుడు గారి తప్పుడు కేసులు పెట్టడం
- జగన్ సతీమణి పైన తప్పుడు రాతలు రాస్తే అతన్ని అరెస్ట్ చేసి జైలు కి పంపాం
అంబటి వల్లే అసెంబ్లీలో కంటతడి పెట్టిన చంద్రబాబు : కూటమి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ మంత్రి వైసిపి నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీలో అంబటి రాంబాబు వల్లే చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారని సత్యప్రసాద్ గారు పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అంబటి వల్లే అసెంబ్లీలో కంటతడి పెట్టిన చంద్రబాబు
కూటమి మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు గురించి ఇలా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ… ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీ లో ఉన్నాను. ఆ రోజు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టడానికి కారణం ఇదే అంబటి అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి, ఆరోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంటతడి పెడితే దాన్ని కూడా మీరు హేలనగా సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి.
కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తా ఉంది మనకి మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్ డెడికేటెడ్ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా క్రుంగి తీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు.
ఇప్పుడు నేను వైసిపి నాయకులని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలా అని నేను సూటిగా మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను.
వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతని కులం మతం మేము చూడలేదు. అతను ఎవడో కూడా మాకు తెలియదు. అది మా చిత్తశుద్ధి. ఎప్పుడైనా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగతంగా పోకూడదు. అని సత్యప్రసాద్ గారు వ్యాఖ్యానించారు.
లోకేష్ గారి గురించి అవ్వచ్చు పవన్ గారి గురించి అవ్వచ్చు మీరు మాట్లాడే భాష ఏంటి ఒక స్టేచర్ నాయకుల్ని అట్లాంటి మాటలు తూలుతున్నారు. అంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు అశాంతి క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం తప్పకుండా మీరు అన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి నేను అడుగుతున్నాను.
