Galla Madhavi : అంబటి దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాలి… గళ్ళా మాధవి మాస్ వార్నింగ్

అంబటి దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాలి : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైసిపి కార్యకర్తలకు అంబటి రాంబాబు సన్నిహితులకు పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన గళ్ళా మాధవి. ఒక రకంగా చెప్పాలంటే మాధవి గారు సినిమా లెవెల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

అంబటి దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాలి

గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ… ఇది ఇక్కడితో వదిలేయండి. అంబటి రాంబాబుకి శిక్ష పడాలి అనుకున్నాం. క్షమాపణ చెప్పాలి అనుకున్నాం అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం చట్టం తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతాది. దీన్ని అనవసరమైన డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి. తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. గుర్తు పెట్టుకోండి ఇది గనుక రిపీట్ అయితే మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తాయి.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

ఒకళ్ళం కాదు ఈసారి, ఒక మహిళను అవమానించినందుకు గుంటూరు మహిళా గళ్ళా మాధవి, గుంటూరు మహిళల్ని వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయటానికి వచ్చిందని గుర్తు పెట్టుకోండి. ఇదే మీరు మళ్ళీ పదేపదే గనుక రెచ్చగొడుతూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనుక వేస్తే ఈరోజు గుంటూరు మహిళా కాదు ఈ సారి ఆంధ్ర మహిళ బయటికి వస్తుంది. మీరు అది గుర్తు పెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు దీన్ని ఆపేయండి అని గళ్ళా మాధవి గారు వ్యాఖ్యానించారు.

Leave a Comment